హైదరాబాద్: మన ఊరు, మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులు అన్ని త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో కార్వాన్, గోషామహల్ నియోజకవర్గాలలోని పాఠశాలల్లో జరుగుతున్న పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇది మన ప్రభుత్వం చేపట్టిన విన్నూతమైన కార్యక్రమమని, దీని కోసం రూ. 7వేల కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. మీరు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తయారు చేయాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు దానిని పవిత్ర కార్యక్రమంగా భావించి పనులను త్వరగా పూర్తి చేయాలని, కార్యక్రమాన్ని శాఖపరమైన పనులు ఉన్నప్పటికి వాటిని వాయిదా వేయకుండా తక్షణమే పూర్తి చేయాలన్నారు. కాంపౌండ్ వాల్స్, ఎలక్ట్రిసిటి పనులు, చిన్న చిన్న రిపేర్లు, పాఠశాలకు రంగులు వేయడం పనులన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ఈకార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి రోహిణి, ఉప విద్యాశాఖాధికారులు ఏఈలు, డీఈలు, ప్రధానోపాధ్యాయులు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మన బడి కార్యక్రమంలో పనులు త్వరగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -