Sunday, January 19, 2025

3 నెలల్లో నాలాల బాగు

- Advertisement -
- Advertisement -

Completion of Nala development works in three months

హైదరాబాద్ : నాలాల అభివృద్ధి పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎల్‌బినగర్ జోన్‌లోని చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వనస్థలిపురంలో ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం జోనల్ కార్యాలయంలో మేయర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ చిన్నపాటి వర్షాలకే ఎల్‌బినగర్ పరిసర ప్రాంతాలు తీవ్ర వరద ప్రభావానికి గురువుతుండడంతో యుద్ధ్దప్రతిపాదికన నాలాల అభివృద్ధి పనులను పూరైయేలా అన్ని చర్యలు తీసుకు కోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు నివారణకు ప్రభుత్వం మొదటిదశ కింద రూ.858 కోట్లతో 52 పనులకు శ్రీకారం చుట్టిందని ఆమె వెల్లడించారు.

ఇందులో భాగంగా ఎల్‌బినగర్ జోన్‌లో రూ.114కోట్ల వ్యయంతో చేపట్టిన 10 నాలాల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, ఈ పనులు మూడు నెలల్లో పూర్తి చేయాలని, అప్పటి వరకు ఎవ్వరికీ ఎలాంటి సెలవులు ఇవ్వద్దని సిఈని ఆదేశించారు. టెండర్ ప్రక్రియ పూరైన వెంటనే ఏజెన్సీలను ఒకేసారి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నాలా అభివృద్ధి పనులకు జోనల్ స్థాయి అధికారులు అన్నివిధాలుగా సహకరించాలని సూచించారు. అదేవిధంగా ఇకమీదట నాలాల వద్ద ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా భద్రత ఆడిట్‌కు గాను కన్సల్టెన్సీ ఏర్పాటు చేసి జోనల్ స్థాయిలో పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. నాలా పనుల పురోగతికి సంబంధించిన సమచారాన్ని రోజువారీగా పంపించాలన్నారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి కార్యక్రమం ద్వారా 14 పనులు చేపట్టగా ఇందులో 6పనులు పూర్తి కాగా పురోగతిలో ఉన్న మిగిలిన 7 పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. జోన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించేందుకు టౌన్ ప్లానింగ్ అధికారులు అన్ని చ్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ పంకజ ఎస్‌ఎన్‌డిపి సిఈ కిషన్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News