Wednesday, January 22, 2025

ఏడు సంవత్సరాల బాలునికి క్లిష్టమైన లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్:  నగరానికి వైద్యులు ఏడు సంవత్సరాల బాలునికి ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడారు. పల్నాడు జిల్లా క్రోసూరు గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ అష్రాఫ్ గ్లైకోజెన్ స్టోరేజ్ డిజార్డర్ అనబడే అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో భాదపడుతున్నాడు. అది బాలుని ఎదుగదలకు, శారీరక అభివృద్దికి అవరోధం కావడమే కాకుండా ప్రాణాంతకంగా కూడా పరిగమించడం జరుగుతోంది. దీంతో తల్లిదండ్రులు నగరంలోని రెనోవా ఆసుపత్రికి చెందిన లివర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డా. ఆర్ వి రాఘవేంద్ర రావును సంప్రదించారు. ఆయన బాలునికి అన్ని రకములైన ఆరోగ్య పరీక్షలు నిర్వహించి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ శస్త్ర చికిత్స మాత్రమే అతనికి ప్రాణాలు పోయగలదని నిర్థారించారు.

వైద్యుని నిర్ణయం మేరకు బాలుని తల్లి షేక్ బేబి హజారా తన లివర్ ని అందించడానికి ముందుకు రాగా, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొంత మేర ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చింది. ఇలా తల్లి, ప్రభుత్వ సహకారంతో రెనోవా ఆసుపత్రి వైద్య బృందం ముందుగా బాలుని తల్లి షేక్ బేబి హజారా నుండి హెపాటెక్టటమీ అనే శస్త్ర చికిత్స ద్వారా లివర్‌ని సేకరించి అనంతరం సేకరించిన లివర్ ని బాలునికి విజయవంతంగా అమర్చడం జరిగింది. శస్త్ర చికిత్స అనంతర చికిత్సను పొందిన తర్వాత బాలుడు షేక్ మహమ్మద్ అష్రాఫ్ తో పాటూ లివర్ ని అందించిన తల్లి షేక్ బేబి హజారా లు ఇరువురూ కోలుకొని పూర్తి ఆరోగ్య వంతులుగా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News