Thursday, January 23, 2025

నవంబర్ 6 నుంచి సమగ్ర కుటుంబ సర్వే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6 నుంచి మూడు వారాల పాటు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించనున్నది. దీనికోసం 150 కుటుంబాలకు ఓ ఎన్యూమరేటర్ ఉంటాడు.  ప్రస్తుతం ఇండ్లకు నంబర్లు వేసే పనిలో అధికారులు, సిబ్బంది బిజీగా ఉన్నారు. సమగ్ర సర్వే ద్వారా రాష్ట్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ ముఖచిత్రం స్పష్టం కానున్నది. కులం విషయంలో తప్పుడు సమాచారం ఇస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. కుటుంబ సర్వేలో కులంతో పాటు ఆదాయం, ఆస్తులు వంటి వ్యక్తిగత వివరాలు కూడా చెప్పాల్సి ఉంటుంది. 75 ప్రశ్నలతో ఫార్మాట్ రూపొందించారు. ఇంతేకాక ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఏయే పథకాల ద్వారా లబ్ధిపొందారనే ప్రశ్నలకు కూడా జవాబివ్వాల్సి ఉంటుంది. ప్రతి వ్యక్తి జాతకం చిట్టా ఈ సమగ్ర సర్వేతో ప్రభుత్వానికి అర్థమైపోతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News