Wednesday, January 22, 2025

సర్వే సర్వత్రా..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా అసలు ప్రక్రియ శనివారం ప్రా రంభమైంది. మొదటి దశలో మూడు రోజులుగా కుటుంబాలను గుర్తించిన సిబ్బంది ఇళ్లకు స్టిక్కర్లు వేసిన విషయం తెలిసిందే. శనివారం నుంచి కు టుంబాల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. కుటుంబాల గుర్తింపు, సిక్కర్లు వేయడం శుక్రవారంతో ముగిసినా శనివారం కూడా హైదరాబాద్ నగరంలోని పలు బస్తీలలో కుటుంబాలను గుర్తించి స్టిక్కర్లు వేస్తూ ఎన్యుమరేటర్లు కనిపించారు. మరోవైపు రాష్ట్రంలో కుటుంబాల గు ర్తింపు, తొలిరోజు సమగ్ర సమాచారం సేకరించడంలో సిబ్బందికి పలు చోట్ల ప్రజల నుండి సహా య నిరాకరణ ఎదురయ్యింది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో సర్వేకు వెళుతున్న ప్రభుత్వ ఉ పాధ్యాయులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. సెక్యురిటీ సిబ్బంది ఇంటి లోపలికి అనుమతించడం లేదు. మరికొన్ని ప్రాంతాల్లో కుక్కలను వదులుతున్నారని సర్వే అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సమగ్ర కుటుంబ సర్వే సం దర్భంగా సిబ్బంది అడుగుతున్న ప్రశ్నలపై ప్రజ ల నుండి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ సమాచారంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగిపోతాయోనన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది, వ్యక్తిగత
విషయాలు ఎందుకు చెప్పాలంటూ కొందరు ఎదురు ప్రశ్నించడం కనిపించింది. ప్రజల సహాయ నిరాకరణతో సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఇలా అయితె టార్గెట్ ఎలా పూర్తి చేసేది అంటూ మదనపడుతున్నారు. ప్రొరంభంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మునుముందు ఇంకా ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందోననే సిబ్బంది ఆందోళన పడుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వం బిసి, ఎస్‌సి, ఎస్‌టి, ఇతర వెనకబడిన వర్గాల అభివృద్ధికి, అవకాశాలు కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలు చేసేందుకు సమగ్ర కుటుంబ సర్వేకు శ్రీకారం చుట్టింది. ఇక ఈ సర్వే డేటా ఆధారంగానే స్థానిక సంస్థల్లో బిసిలకు రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. కాగా. కుటుంబ వ్యక్తిగత వివరాలను ఎన్యూమరేటరు సేకరించడమే కాకుండా వృత్తి, వ్యాపార, ఉద్యోగాల కోసం స్వగ్రామంలోని ఇల్లు వదిలి, దూరప్రాంతాల్లోని పట్టణాలు, నగరాల్లో నివసించే వారికి రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. జిహెచ్‌ఎంసి పరిధిలో 19,722 ఎన్యూమరేటర్లు పని చేస్తున్నారు. సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు అధికారులు ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ నెల 21 వరకు ఇంటింటికి తిరిగి సర్వే వివరాలు ఎన్యుమరేటర్లు సేకరించనున్నారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుంటుంబ, కుల సర్వే
తెలంగాణలో మొత్తం 1,17,44,954 కుటుంబాలు ఉన్నాయని, అన్ని ఇళ్లను 87,092 ఎన్యూమరేషన్ బ్లాక్‌లుగా విభజించినట్లు ప్రణాళిక శాఖ వివరించింది. హైదరాబాద్‌లో మొత్తం 28,32,490 కుటుంబాలు ఉన్నాయి. వీటిని 19,328 ఎన్యూమరేషన్ బ్లాక్‌లుగా విభజించారు. సర్వే పూర్తి చేయడానికి 94,750 మంది గణకులను, వారిపై 9,478 మంది సూపర్‌వైజర్లను, ప్రభుత్వం నియమించింది.
ఇవ్వాల్సిన వివరాలు : ఆధార్ కార్డులో చిరునామా ఉన్న చోటికి, స్వగ్రామానికి వెళ్తేనే కుటుంబ వివరాలు నమోదు చేస్తారనే అపోహ పడవద్దని రాష్ట్ర ప్రణాళిక శాఖ తెలిపింది. సర్వేలో కుటుంబ సభ్యుల వ్యక్తిగత ఆధార్, సెల్‌ఫోన్ నంబర్లు, ప్రశ్నపత్రంలో అడిగిన వివరాలన్నీ తెలపాలి. ఆధార్, రేషన్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు పాసు పుస్తకం వంటివి అందుబాటులో ఉంచుకుంటే సర్వే కోసం వచ్చిన గణకులకు త్వరగా సమాచారం ఇవ్వవచ్చని అధికారులు తెలిపారు.

ఎన్యూమరేటర్లకు చేదు అనుభవం.. కుక్కలను వదిలిన వ్యక్తులు
సమగ్ర కుటుంబ సర్వేలో సిబ్బందికి వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. కొన్ని చోట్ల ప్రజల నుండి చివాట్లు ఎదుర్కోవలసి వస్తోంది. ఇంటింటికి వెళ్తున్న ఎన్యూమరేటర్లకు చేదు అనుభవాలు ఎదురవుతున్న పలు సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఒక ఇంటికి వెళ్లిన ఇద్దరు మహిళా ఎన్యుమరేటర్లపై ఇంటి యజమానులు కుక్కలను వదిలి దుర్భాషలాడినట్లు ఆరోపణలు వచ్చాయి. బంజారా హిల్స్ లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న అపురూప, రమ్యశ్రీ అరోరా కాలనీలో కుటుంబ వివరాలు నమోదు చేయడానికి ఓ ఇంట్లోకి వెళ్లారు. అయితే వారిపై ఇంటి యజమాని దుర్భాషలాడి, వారిపైకి కుక్కలను వదిలాడని, భయాందోళనకు గురైన వారు అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయం నెట్టింట వైరల్గా మారడంతో ఈ ఘటనపై దర్యాప్తు చేసి కుక్కలు వదిలిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులకు ఎక్స్ వేదికగా ట్యాగ్ చేశారు.

శాస్త్రిపురంలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన స్థానికులు.
రోడ్డు నుండి లోపలికి నిర్మించిన ఇండ్లు కూడా కూల్చేశారని శాస్త్రీపురంలో ప్రజలు ఆందోళనకు దిగారు. మా దగ్గరున్న పేపర్లు చూసి కూడా కూల్చివేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్మల్ జిల్లాలో బహిష్కరణ
ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ, కుల సర్వేను నిర్మల్ జిల్లాలోని దిలావర్‌పూర్, గుండంపెల్లి గ్రామాల్లోని ప్రజలు బహిష్కరించారు. తమ గ్రామాలైన దిలావర్‌పూర్-, గుండంపెల్లి మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా వారు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేపడుతున్నారు. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కుల గణన సర్వే ప్రారంభమవడంతో దానిని నిర్వహించేందుకు గ్రామాల్లోని ప్రజల వద్దకు ఎన్యుమరేటర్లు వెళ్లగా, ప్రజలు తిరస్కరించడం తీవ్రమైన అంశంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News