మన తెలంగాణ/హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వే ను ప్రతిష్టాత్మకంగా తీసుకొ ని అధ్యయనం కోసం సామాజికవేత్తలతో స్వతంత్ర హో దా కలిగిన కమిటీ ఏర్పాటు చేసినట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. శుక్రవారం డాక్ట ర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో సలహా కమి టీ సభ్యులతో డిప్యూటీ సిఎం భట్టి సమావేశమ య్యారు. ఆర్థిక, రాజకీయ, విద్య, సామాజిక, న్యా య అంశాలకు సంబందించిన స మగ్ర సర్వే సమాచారాన్ని విశ్లేష ణ చేసి ఎలాంటి పొరపాట్లకు ఆ స్కారం లేకుండా మేధావులు, సా మాజిక శాస్త్రవేత్తలు కృషి చేయాలని కోరారు. అధ్యయన కమిటీకి జస్టిస్ సుదర్శన్ రెడ్డి చైర్మన్‌గా, రిటైర్డ్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య వైస్ చైర్మన్‌గా, ప్రవీణ్ చక్రవర్తి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు ఉపముఖ్యమంత్రి తెలిపారు. కమిటీ సభ్యులుగా డాక్ట ర్ సుఖదేవ్, రిటైర్డ్ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, శాంత సిన్హా, ప్రొఫెసర్ హిమాన్షు, ప్రొఫెసర్ భూక్య భంగ్య, ప్రత్యేక ఆహ్వానితులుగా జీన్ డ్రీజ్ ఉంటారని వివరించారు. ఈ నిపుణుల కమిటీ సర్వే నివేదికను విశ్లేషించి నెల రోజుల్లో ప్రణాళిక శాఖకు అందజేయాలని తెలిపారు.
ఈ సామాజిక ఆర్థిక సర్వేను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉన్నత భావంతో మార్గదర్శనం చేసినట్లు బట్టి చెప్పారు. సామాజిక న్యాయానికి పునాది వేయాలన్న లక్షంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం సర్వే జరిపించింది తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్న పొరపాటుకు అవకాశం ఇవ్వరాదనే ఆలోచనతో లోతుగా అధ్యయనం చేసి భాగస్వాములు అందరితోనూ సర్వేపై ముందస్తుగా సమావేశాలు నిర్వహించామన్నారు. ప్రతి 150 ఇండ్లను ఒక బ్లాక్ గా ఏర్పాటు చేసుకుని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా సర్వే నిర్వహించామని తెలిపారు. అపోహలకు తావు లేకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో సామాజిక స్పృహ కలిగిన మేధావులను సమగ్ర కుటుంబ సర్వే అధ్యయనంలో భాగస్వాములను చేసి వారి నేతృత్వంలోని కమిటికి స్వతంత్ర హోదా కల్పించినట్టు ఉపముఖ్యమంత్రి చెప్పారు. ఈ సమావేశంలో ప్రణాళికా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియాతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.