Thursday, January 23, 2025

సమగ్ర శిక్ష అభియాన్ పోస్టుల కౌన్సెలింగ్ పూర్తి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : విద్యాశాఖలో పెండింగ్‌లో ఉన్న 21 సమగ్రశిక్షా అభియాన్ పోస్టుల భర్తీకి మంగళవారం కలెక్టరేట్‌లోని డిఈఓ కార్యాలయంలో జెడ్పి సిఈఓ ఉష, డిఈఓ గోవిందరాజులు కౌన్సెలింగ్ నిర్వహించి నియామక పత్రాలను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మేరకు సమగ్ర శిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఉత్తర్వుల ప్రకారం డాటా ఎంట్రీ ఆపరేటర్, సిస్టం ఎనాలసిస్ట్, ఎంఈఎస్ కో ఆర్డినేటర్, అసిస్టెంట్ ప్రొగ్రాం ఆఫీసర్, ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేసేందుకు ప్రభుత్వం 2019న నవంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది.

అప్పట్లో దరఖాస్తులు స్వీకరించి రాత పరీక్ష కూడా నిర్వహించారు. మెరిట్ జాబితా సైతం ప్రకటించారు. రాష్ట్ర విద్యాశాఖ అనివార్య కారణాలతో ఈ నియామక ప్రక్రియను నిలిపివేసింది. ప్రస్తుతం నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని 21 పోస్టులకు సంబంధించిన 17 మంది అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి కలెక్టర్ ఆమోదంతో నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ప్లానింగ్ కో ఆర్డినేటర్ నూరుద్దీన్, కో ఆర్డినేటర్ బరపటి వెంకటయ్య, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ మురళీధర్ రెడ్డి, జెడ్పి సూపరిండెంట్ యూసుఫ్, సెక్షన్ క్లబ్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News