Monday, December 23, 2024

సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి : కోదండరాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఈ పథకం కింద రాష్ట్రంలో కంప్యూటర్ ఆపరేటర్‌లు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీఅచర్స్, క్లర్కులు, రిసోర్స్ పర్సన్స్ పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం వీరిని నోటిఫికేషన్ ద్వారా రోస్టర్ ప్రకారం రిజర్వేషన్లు పాటిస్తూ నియామకాలు చేసిందని, అందువల్ల వీరందరిని రెగ్యులరైజ్ చేయవచ్చని ఆయనన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న రీలే నిరాహార దీక్షకు కొదండరాం సంఘీభావం తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అప్పటివరకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విద్యావ్యవస్థ నిలబడడానికి సమగ్ర శిక్ష ఉద్యోగులు దోహదపడుతున్నారని కోదండరాం తెలిపారు. వారికి ప్రభుత్వం సరైన జీతాలు చెల్లించడం లేదని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీం తీర్పును అమలు చేయడం లేదన్నారు. కోదండరాం వెంట టిజెఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పల్లె వినయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి కెవి రంగారెడ్డి, యువజన రాష్ట్ర కో ఆర్డినేటర్ కొత్త రవి, విద్యార్థి జన సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఏటేల్లీ శేఖర్ యాదవ్ తదితరులు ఉన్నారు.
హాంగార్డ్ రవీందర్ కు న్యాయం చేయాలి
ఆత్మహత్యాయత్నం చేసుకున్న హాంగార్డ్ రవీందర్ కుటుంబ సభ్యులను ప్రొఫెసర్ కోదండరాం పరామర్శించారు. గురువారం హాస్పిటల్ లో వారిని కలిసి పరామర్శించిన కోదండరామ్ అనంతరం హాస్పిటల్ ఎదురుగా హోంగార్డులు చేస్తున్న నిరసనలో పాల్గొని మద్దత్తు తెలిపారు. కోదండరాంతో పాటు టిజెఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పల్లె వినయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి కెవి రంగారెడ్డి, యువజన రాష్ట్ర కో ఆర్డినేటర్ కొత్త రవి, విద్యార్థి జన సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఏటేల్లీ శేఖర్ యాదవ్ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News