Monday, December 23, 2024

హెచ్ఎండిఎలో పని చేసే కంప్యూటర్ ఆపరేటర్ గుండెపోటుతో మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రేరా డైరెక్టర్, హెచ్ఎండిఎ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఎసిబి కేసు నేపథ్యంలో హెచ్ఎండిఎ ఉద్యోగులు, కంప్యూటర్ ఆపరేటర్లు (అవుట్ సోర్సింగ్ సిబ్బందికి) ఎసిబి నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. హెచ్ఎండిఎ ప్లానింగ్ విభాగంలో పని చేసే కంప్యూటర్ ఆపరేటర్ శేఖర్ గుండెపోటుతో మృతి చెందాడు. కొన్ని రోజులుగా వివిధ రిపోర్టుల పేరుతో సెలవు దినాలు లేకుండా రాత్రి వరకు పని చేస్తున్నారు. మొన్న ఆదివారం డ్యూటీకి రావడంతో పాటు నిన్న రాత్రి 7గంటల వరకు ఆఫీసులో అధికారులు పని చేయించారు. గత 15 సంవత్సరాలకు పైగా హెచ్ఎండిఎలో శేఖర్ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నారు. శేఖర్ ఆకస్మిక మృతికి హెచ్ఎండిఎ ఉద్యోగులు, సిబ్బంది. సంతాపం వ్యక్తం చేస్తూ గురువారం మధ్యాహ్నం స్వర్ణజయంతి కాంప్లెక్స్ లో సంతాప సమావేశం నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం పాతబస్తీలో శేఖర్ అంత్యక్రియలు జరుగనున్నాయి. పని ఒత్తిడితోనే శేఖర్ చనిపోయాడని కుటుంబ సభ్యులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆరోపణలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News