Monday, December 23, 2024

కామ్రేడ్ రొడ్డ అంజయ్య ఇకలేరు….

- Advertisement -
- Advertisement -

కామ్రేడ్ రొడ్డ అంజయ్య మరణం పీడిత ప్రజల ఉద్యమానికి తీరనిలోటు

కామ్రేడ్ అంజన్నకు జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాం

హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా పని చేస్తున్న రొడ్డ అంజయ్య ఆకస్మిక మరణం ఫీడిత ప్రజల ఉద్యమానికి తీరని లోటు ని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు జి . నాగయ్య ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు , రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్ , బొప్పని పద్మ , రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ ఆంజనేయులు సంతాపం తెలిపారు.
ఈ రోజు సంగారెడ్డి లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశాలకు హాజరైన కామ్రేడ్ రొడ్డ అంజయ్య సుగర్, బిపి లెవల్స్ పెరగడంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకు వెళ్లారు. చికిత్స పొందుతునే అంజయ్య కన్నుమూశాడు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి తీరని లోటు అని, వీరికి గతంలోనే మూడు సార్లు గుండెకు సంబంధించిన ఆపరేషన్లు మూడు సార్లు జరిగాయి.

వీరతెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో విద్యార్థి యువజన, వ్యవసాయ కార్మిక ఉద్యమాలకు ఉమ్మడి నల్గొండ జిల్లా లో నాయకత్వం వహించి నడిపారు. అనేక కూలి, భూ పోరాటాలను పేదలను సమీకరించి భూ స్వాములు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులుగా, పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు గా కొనసాగుతున్నారు. భార్య రాములమ్మ ఐద్వా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. కొడుకు భగత్ ఎస్ఎఫ్ఐ డివిజన్ నాయకులుగా పనిచేశారు. జ్యోతి, సరిత ఇద్దరు కుతుళ్లకు ఆదర్శ వివాహం జరిపించారు. కోడలు సోని తో పాటు మునువళ్ళు , మనువరాళ్లు వున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News