Wednesday, January 22, 2025

నాట్యంతో ఏకాగ్రత, క్రమశిక్షణ : డా.ఎస్.పి. భారతి

- Advertisement -
- Advertisement -

కాచిగూడ : నాట్యంతో ఏకాగ్రత, క్రమశిక్షణ పెంపొందుతాయని ప్రముఖ నృత్యగురువు, కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యురా లు డా.ఎస్.పి. భారతి అన్నారు. గురువారం త్యాగరాయగానసభలో నిర్వహించిన శ్రీక ఈవెంట్స్, శ్రీరాగ వల్లరి వార్షికోత్సవం వేడుకల్లో ఆమే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సంగీతం నృత్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు శిక్షణ ఇప్పిస్తే వారు చదువులో ఒత్తిడికి గురి కారని ఆత్మ విశ్వాసం కలుగుతుందని అన్నారు. శ్రీక ఈవెంట్స్ ఉన్నత ఆశయంతో ప్రతిభావంత కళాకారులను ప్రోత్సహిస్తోందని కొనియాడారు.

ప్రముఖ సంగీత గాయనీ డా.రమాప్రభ మాట్లాడుతూ.. నృత్యం, గీతం, గానం కలిస్తే భారతీయ కళలు అని వివరించారు. సంస్థ వ్యవస్థాపకులు ఉదయశ్రీ, చంద్రరేఖలు మాట్లా డుతూ.. తమ సంస్థ ద్వారా కరోనా సమయంలో ఆన్‌లైన్ వేదికగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా గురువులు అహల్య, శైల జ, లలితవినోద్, నరసింహప్రసాద్‌లను ఘనంగా సత్కరించి, అభినందించారు. తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత రిజిస్ట్రార్ డా. సుద ర్శన్ సింగ్ అధ్య క్షత వహించిన సభలో సంఖ్యాశాస్త్రవేత్త దైవజ్ఞశర్మ, సంగీత దర్శకుడు ఆత్రేయ, బి.జె.పి నాయకుడు వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నా రు. సభకు తొలుత సుమారు పది ఘంటల పాటు నృత్యాలతో శాస్త్రీయ సంగీతం, వాయిద్య గోష్టితో ప్రేక్షకులను కనువిందు చేశారు. జయదేవుని అష్ట పది కీర్తనలను నర్తకీ మణులు అద్భుతంగా ప్రదర్శించి గానసభను నవరస భరతం చేసి, ఆకట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News