Monday, December 23, 2024

రాహుల్ గాంధీ బస చేసిన హోటల్ వద్ద కాంగ్రెస్ నేతల ఆందోళన

- Advertisement -
- Advertisement -

‘సేవ్ కాంగ్రెస్, సేవ్ చెన్నూర్’ అంటూ ప్లకార్డుల ప్రదర్శన

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘విజయ భేరి’ బస్సుయాత్రలో భాగంగా మూడోరోజు కరీంనగర్‌లో రాహుల్ గాంధీ బసచేసిన హోటల్ వద్ద కాంగ్రెస్ నేతలు అందోళనకు దిగడం కలకలం రేపింది. ‘సేవ్ కాంగ్రెస్, సేవ్ చెన్నూర్’ అంటూ ప్లకార్డులు పట్టుకొని చెన్నూర్ టికెట్ ఆశిస్తున్న నల్లాల ఓదెలు, రాజా రమేష్, నూకల రమేశ్ ఆందోళనకు దిగారు. చెన్నూర్ టికెట్ ను పొత్తులో భాగంగా సిపిఐకి కేటాయించొద్దని ఈ సందర్భంగా వారు కోరారు. రాహుల్ గాంధీ బస చేసిన హోటల్ వద్దకు ఒక్క సారిగా కాంగ్రెస్ శ్రేణులే ఆందోళనకు దిగడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీ సంఖ్యలో చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News