Wednesday, January 22, 2025

శ్రీశైలంలో భక్తుల ఆందోళన.. గేటుకు తాళాలు వేసిన చెంచులు

- Advertisement -
- Advertisement -

శ్రీశైలం: శిఖరేశ్వరం ఫారెస్ట్ చెక్ పోస్టు వద్ద భక్తులు ఆందోళన చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించిన భక్తులు నిరసన చేస్తున్నారు. ఇష్టకామేశ్వరి ఆలయ దర్శనానికి పంపించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. భక్తుల ఆందోళనలతో 2 గంటల పాటు శిఖరేశ్వరం వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. శ్రీశైలం సర్కిల్ పోలీసులు జోక్యం చేసుకుని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. భక్తుల ఆందోళన కొనసాగుతుండగా మరోవైపు చెంచులు నిరసనలు చేస్తున్నారు. తమ ఆదాయానికి అటవీ శాఖ అధికారులు గండికొడుతున్నారని ఆరోపిస్తూ చెంచులు దర్నా చేస్తున్నారు. ఇష్టకామేశ్వరి మార్గంలోని అటవీశాఖ గేటుకు చెంచులు తాళాలు వేశారు. తమ సమస్యలను అటవీశాఖ అధికారులు పరిష్కరించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News