యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని బిఎన్ తిమ్మాపురం(బస్వాపురం ప్రాజెక్టు) భూనిర్వాసితుల కోసం భువనగిరి మున్సిపల్ పరిధిలోని హుస్నాబాద్ శివారులో ఏర్పాటు చేసిన ఆర్అండ్ఆర్ ప్లాట్ల కేటాయింపు కార్యాక్రమానికి ముంపు భాదితులైన బిఎన్ తిమ్మాపురం గ్రామస్తులు, రైతులు ఎవరు కూడా పాల్గొన్నవద్దని తిమ్మాపురం గ్రామస్తులు, గ్రామ ప్రజాప్రతినిధుల భర్తలను, ఇతర నాయకులను గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉండగా గేటుకు తాళం వేసి అడ్డుకున్నారు.
పూర్తి స్థాయిలో నష్ట పరిహారం చెల్లించాలని, అందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ తోపాటు అందరికీ ఫ్లాట్లు అందించి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన తర్వాతనే ఆర్అండ్ఆర్ పాట్లు కేటాయింపు జరగాలని అప్పటి వరకు గ్రామ ప్రజా ప్రతినిధులు, ఇతర ముఖ్య నాయకులు ఎక్కడికి పోయేది లేదని సర్పంచ్ భర్త పిన్నం రాజు,ఎంపిటిసి భర్త ఉడుత అంజనేయుల తోపాటు ఉప సర్పంచ్, మాజీ సర్పంచ్ ఎస్ఎమ్సి చైర్మన్ లను గ్రామ పంచాయతీలో వేసి నిర్బంధించారు. కాగా ఈరోజు అధికారికంగా ఆర్అండ్ఆర్ పాట్లు లాటరీ పద్దతిలో కేటాయించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పమేల సత్పత్తి మంగళవారం సాయంత్రం తెలిపారు.