- Advertisement -
హైదరాబాద్: బషీర్ బాగ్ లోని నిజాం కాలేజ్ విద్యార్థులు శనివారం ఆందోలనకు దిగారు. బషీర్ బాగ్ లో హాస్టల్ ముందు రోడ్డపై విద్యార్థులు బైఠాయించారు. మెస్ ఓపెన్ చేయాలంటూ నిజాం కాలేజీ విద్యార్థులు దర్నా చేస్తున్నారు. విద్యార్థులు మెస్ ఫీజు చెల్లించలేదని మెస్ ను వార్డెన్ మూసివేశాడు. విద్యార్థుల ఆందోళనకు కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు. పోలీసులు సర్దిచెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
- Advertisement -