Saturday, November 23, 2024

వ్యవసాయ చట్టాలపై ఆందోళన ఆగదు : రాకేష్ తికాయత్

- Advertisement -
- Advertisement -

Concern over agriculture laws will not stop: Rakesh Tikait

27న భవిష్య కార్యాచరణపై నిర్ణయం

ఘజియాబాద్ : వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఆందోళన అప్పుడే అంతం కాదని, ఈనెల 27న భవిష్య కార్యాచరణపై నిర్ణయం తీసుకోవడమౌతుందని భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) జాతీయ అధికార ప్రతినిధి రాకేష్ తికాయత్ బుధవారం స్పష్టం చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు ఎప్పుడు నెరవేరుస్తారని ఆందోళన కారులు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారని ఆయన అన్నారు. జనవరి 1 నుంచి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారని, అందువల్ల ఇదెంతవరకు వచ్చిందని తాము అడుగుతామని చెప్పారు. తమ పంటలకు సరైన గిట్టుబాటు ధర లబించినప్పుడే రైతులకు విజయం సిద్ధించినట్టు అని తికాయత్ హిందీలో ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News