వ్యాధుల నియంత్రణ డైరెక్టర్ రోచెల్లే
వాషింగ్టన్: అమెరికాలో కరోనా వ్యాప్తిలో డెల్టా వేరియంట్‌దే ఇక కీలక పాత్ర కానున్నట్టు అంచనా వేశామని ఆ దేశ వ్యాధుల నియంత్రణ కేంద్రం డైరెక్టర్ రోచెల్లే వాలెంక్సీ తెలిపారు. డెల్టా వేరియంట్‌కు వేగంగా వ్యాప్తి చెందే గుణం ఉన్నందున,దాని పట్ల తమకు ఆందోళన ఉన్నదని ఆమె తెలిపారు. అయితే, వ్యాక్సినేషన్ ద్వారా దానిని కట్టడి చేయొచ్చునని భరోసా ఇచ్చారు. డెల్టా నుంచి రక్షణ కోసం వ్యాక్సిన్లు తీసుకోవాల్సిందిగా అమెరికన్లకు ఆమె సూచించారు. ఇప్పటివరకు తమ దేశంలో 20 కోట్ల డోసులకుపైగా పంపిణీ జరిగిందని ఆమె తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న 30 ఏళ్లలోపు వారిలోని 300మందిలో గుండెలో వాపు వచ్చినట్టు వార్తలొచ్చాయని, వచ్చేవారం సలహా కమిటీ దీనిపై పరిశీలిస్తుందని తెలిపారు. భారత్‌లో మొదట గుర్తించిన డెల్టా వేరియంట్ ఇప్పటికే బ్రిటన్‌లో కరోనా వ్యాప్తిలో కీలకంగా మారింది.