- Advertisement -
అల్మాటీ : మధ్య ఆసియా దేశమైన కజక్‌స్థాన్ లో చెలరేగిన అల్లర్లలో ఇప్పటివరకు 164 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు వారం రోజులుగా అట్టుడికి పోతున్న ఈదేశంలో విదేశీయులు సహా దాదాపు 6 వేల మంది చిక్కుకుపోయారు. మృతుల్లో 103 మంది ఆల్మాటీకి చెందిన వారే కావడం గమనార్హం. వాహనాల్లో వాడే ఎల్‌పిజి గ్యాస్ ధరల్ని భారీగా పెంచడాన్ని వ్యతిరేకిస్తూ సాగుతున్న ప్రజాందోళన హింసకు దారి తీసింది. అల్మాటీలో ప్రభుత్వ భవనాలే లక్షంగా ఆందోళనకారులు దాడులకు పాల్పడుతున్నారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లోను, ఇరు వర్గాల ఘర్షణల్లోను మృతుల సంఖ్య 164 కు చేరింది.
- Advertisement -