Thursday, January 23, 2025

పోడు సర్వేకు గండం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్/ఖమ్మం: రాష్ట్రంలో నివురుగప్పిన నిప్పులా మారిన పోడు భూముల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కార దిశగా చేపట్టిన ప్రక్రియకు భద్రాది కొత్తగూడెంలో ఎఫ్‌ఆర్‌వో హత్య ఘటనతో బ్రేక్ పడింది. అటవీ సిబ్బంది ఆందోళనలు పోడు భూముల సర్వే కు ఆటంకంగా మారాయి. ఎఫ్‌ఆర్‌వో చలమల శ్రీనివాసరావు హత్యను నిరసిస్తూ ఉ మ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మూడు రో జులుగా అటవీశాఖ ఉద్యోగులు విధులను బహిష్కరించడంతో గ్రామసభలు నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల అటవీ సిబ్బందిపై దాడులు జరిగిన విషయాన్ని ఇటీవల పిసిసిఎఫ్ డోబ్రియల్ తో సమావేశమైన అటవీ ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తావించారు. దీంతో పోడు సర్వేలు, గ్రామసభలకు సంబంధించి పోలీసు యంత్రాంగంతో బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

పోడు భూముల సమస్య తీ వ్రత అధికంగా ఉన్నందున భవిష్యత్తులో ఎ లాంటి ఘటనలు జరుగకుండా కఠిన చ ర్య లు తీసుకోవాలని, ఆయుధాలను ఇవ్వాలని ఉద్యోగ సంఘాలనేతలు కోరుతున్నారు. పోడు దరఖాస్తులపై గందరగోళం నెలకొం ది. దరఖాస్తుల స్వీకరణ గడువు తేదీని బహిర్గతం చేయకపోవడంతో ఇంకా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయని అటవీశాఖ యంత్రాం గం తెలిపింది. ప్రస్తుతం పోడు కొడుతూ దరఖాస్తులు చేసుకుంటున్నారని, దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అటవీ ఉద్యోగి హత్య జరగడంతో వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది ఆందోళనలు.. పోడు సర్వేపై ప్రభావం చూపిస్తున్నాయి.

* డిమాండ్ల సాధనకు దశల వారీగా ఉద్యమం..

తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా ఉద్యమం చేపట్టనున్నట్లు ఫారెస్ట్ రేంజర్స్ అసోసియేషన్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. అడవుల్లో విధులు నిర్వహించే తమకు ఆయుధాలు ఇవ్వాలని, ప్రత్యేకంగా ఫారెస్ట్ స్టేష న్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిబ్బందిని పెంచడంతో పాటు ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని నినదించారు. ఆయుధాలు లేకుండా అడవుల్లో పనిచేసే పరిస్థితులు లేవని అటవీ అధికారులు వెల్లడిస్తున్నారు. తమకు ఆయుధాలను ఇప్పించాలని, పోలీస్ స్టేషన్ల మాదిరిగానే ఫారెస్ట్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.

* మూడు శాఖల సమన్వయంతోనే అటవీ భూముల హద్దులు గుర్తింపు..

రెవెన్యూ, పోలీస్, ఫారెస్ట్ మూడు శాఖల సమన్వయం ఉంటేనే అటవీ భూముల హద్దులు గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుందని క్షేత్రస్థాయి అధికారులు వెల్లడిస్తున్నారు. ఫారెస్ట్ స్టేషన్లు పెట్టి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని కోరుతున్నారు. రెవెన్యూ, పోలీస్ శాఖల నుంచి ఫారెస్ట్ సిబ్బందికి సహకారం ఉండటం లేదని వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు శాఖల సమన్వయం ఉంటేనే అటవీ భూముల హద్దులు గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడిస్తున్నారు. గుత్తి కోయలు పోడు సాగుదారుల కిందకు రారని, వారిని పూర్తిగా అటవీ ఆక్రమణదారులుగా గుర్తించి, అడవి నుంచి బయటకు తీసుకురావాలని ఉద్యోగులు కోరుతున్నారు.

* భయం గుప్పిట్లో క్షేత్ర స్థాయి అటవీ సిబ్బంది..

ఖమ్మం జిల్లాలో ఫారెస్టు రేంజ్ అధికారి శ్రీనివాస్‌రావును గుత్తికోయలు హత్య చేయటంతో పోడుభూముల నియంత్రణ కోసం ప్రయత్నిస్తున్న అటవీశాఖ అధికారులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఉమ్మడి అదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలలో ఇదే తరహా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటంతో జిల్లాలో పనిచేస్తున్న అటవీ సిబ్బంది భయం గుప్పిట్లో విధులు నిర్వహిస్తున్నారు. పోడు భూములకు సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాలను కాదన లేక క్షేత్రస్థాయిలో పోడు రైతులను ఎదురించలేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అటవీసిబ్బంది వాపోతున్నారు. పోడు భూముల వివాదాల్లో అధిక శాతం గిరిజనేతరుల ఆధీనంలో ఉన్న భూముల్లోనే జరుగుతుండటం ఆ వర్గాల వెనుక రాజకీయ జోక్యం ఉందని దాంతో దాడులకు తెగబడుతున్నట్టు అటవీ సిబ్బంది ఆరోపణ.

ఈ క్రమంలో ఆయుధాలిస్తే తప్పా తాము క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే పరిస్థితి లేదని చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం గిరిజన, గిరిజనేతరుల పోడు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తే తప్పా విధులు నిర్వహించలేని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయన్నది అటవీ అధికారుల వాదన. కాగా ప్రభుత్వం త్వరలోనే ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలను జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్న వేళ అటవీ సిబ్బంది సహాయనిరాకరణకు దిగే అవకాశాలున్నాయని పలువురు చెబుతున్నారు. ఖమ్మం ఘటనను దృష్టిలోపెట్టుకొని అటవీసిబ్బంది పోడు భూముల క్రమబద్దీకరణ ప్రక్రియకు సహకరించకపోతే సమస్యపై పీటముడి పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే అటవీ సిబ్బంది మాత్రం తమ భద్రతకు భరోసా దక్కేంత వరకు తాము ధీమాగా పని చేయలేమని స్పష్టం చేస్తున్నారు.

* అటవీ ప్రాంతాలకు వలస వచ్చి…

ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చి గొత్తికోయలు ఉమ్మడి జిల్లాలలోని అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్నారు. 2005లో ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం, సల్వాజుడుం ఉద్యమంతో రావణకాష్టమైంది. దీంతో అక్కడి గొత్తికోయలు సరిహద్దులోని తెలంగాణ జిల్లాలకు వలస వచ్చారు. అప్పటి నుంచి వారిని పంపించేందుకు సర్కారు ప్రయత్నిస్తున్నా జాతీయ స్థాయిలో వివిధహక్కుల కమిటీలు, సంఘాల ఒత్తిళ్లతో వారికి ఇక్కడ రేషన్, ఆధార్, ఓటర్‌కార్డులతో పాటు ఇతర సదుపాయాలు కల్పిస్తున్నారు. నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడక్ట్ సేకరించే విషయంలోనూ స్థానిక ఆదివాసీలతో గొడవలు జరుగుతున్నాయి. రేంజర్ హత్య జరిగిన తర్వాత రాష్ట్రం నుంచి గొత్తికోయలను పంపించాలనే డిమాండ్ స్థానిక ఆదివాసీల నుంచి కూడా వస్తోంది. ఈ క్రమంలోనే గొత్తికోయలను బెండాలపాడు గ్రామస్తులు గ్రామ బహిష్కరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News