Saturday, November 23, 2024

అత్యాచారానికి గురైన బాలిక పరిస్థితి విషమం

- Advertisement -
- Advertisement -

Condition of Girl who was raped is critical

నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స

మనతెలంగాణ, హైదరాబాద్ : ఈ నెల 5వ తేదీన అత్యాచారానికి గురైన బాలిక పరిస్థితి ఆరోగ్యం విషమంగా ఉంది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన బాలిక ఆదివారం ఇంటి బయట ఆడుకుంటోంది. ఒక్కసారిగా అక్కడి నుంచి కన్పించకుండా పోయింది. ఓ నిందితుడు బాలికను అత్యాచారం చేసి సోమవారం ఉదయం ప్రగతినగర్ వద్ద విడిచి పెట్టిపోయాడు. బాలిక ఒంటిపై తీవ్రగాయాలు ఉండడంతో నిలోఫర్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. బాలిక ఒంటిపై తీవ్ర గాయాలు ఉండడంతో వైద్యులు ఇప్పటి వరకు మూడు ఆపరేషన్లు చేశారు. అయినా బాలిక(6) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News