Thursday, January 23, 2025

ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి ఆందోళనకరం : తమిళిసై

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రి దుస్థితి చూస్తే ఆందోళన కలుగుతోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలుపు కోవాలని కోరుతూ ‘జస్టిస్ ఫర్ ఓజిహెచ్’ పేరుతో ఉన్న ఓ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆసుపత్రిలో రోగులు పడుతున్న ఇబ్బందులకు సంబం ధించిన ఫోటోతో పాటు,

కొత్త భవన నిర్మాణానికి జాయింట్ అసోసియేషన్ విడుదల చేసిన లేఖకు సంబంధించిన ఫోటోలు ట్వీట్‌కు జత చేశారు. ‘జస్టిస్ ఫర్ ఓజిహెచ్ చేసిన ట్వీట్‌ను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రీ ట్వీట్ చేస్తూ ఆసుపత్రి దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో మందికి అత్యంత మెరుగైన వైద్య సేవలు అందించిన చరిత్ర ఉస్మానియా ఆసుపత్రికి ఉందన్నారు. ఆసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News