Wednesday, January 22, 2025

నిబంధనల మేరకు ఎన్నికల నిర్వహణ

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతూ కరీంనగర్ జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం చేస్తున్న ఏర్పాట్లు బా గున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎం నోడల్ ఆఫీసర్ (డిప్యూటీ సీఈవో మహారాష్ట్ర) అబాసాహెబ్ ఆత్మరామ్ కావాలే అ న్నారు. కరీంనగర్‌లోని ఈవీఎం గోడౌన్‌లో రానున్న ఎన్నికల కోసం నిర్వహిస్తున్న ఈవీఎం ఎఫ్‌ఎల్‌సీ, వెబ్‌కాస్టింగ్, ఈవీఎంలను భద్రపరచడం, వెబ్‌కాస్టింగ్ గదులను సోమవారం ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న అసెం బ్లీ ఎన్నికలను పురస్కరించుకొని కరీంనగర్ జిల్లాలో వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో చేపడుతున్న ఎఫ్‌ఎల్‌సీ, ఎన్నికల ఏర్పా ట్లు ఈసీఐ నిబంధనల ప్రకారం బాగున్నాయని ఆయన తెలిపారు. ఎఫ్‌ఎల్‌సీ నిర్వహణ, ఈవీఎంలో గోడౌన్‌లోకి ప్రవేశించడం మొదలుకొని ఈవీఎం బ్యాలెట్ యూనిట్ (బీయు) కంట్రోలింగ్ యూనిట్ (సీయు), వివిపాట్ యంత్రాల మొదటిదశ చెకింగ్ ప్రక్రియ, మాక్‌పోల్ నిర్వహణ, ఈవీఎంలను భద్రపరిచే గదిని, సమస్యలు తలెత్తిన వాటిని వేరుగా భద్రపరచడం, సీసీ కెమెరాల ద్వారా నిర్వహిస్తున్న వెబ్‌కాస్టింగ్, అలారం, భద్రత సిబ్బంది, వ్యారికేటింగ్ తదితర విషయాలను పరిశీలించడంతో పాటు పలు విషయాలను గురించి జిల్లా కలెక్టర్, సీపీల ద్వారా అడిగి తెలుసుకున్నారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎఫ్‌ఎల్‌సీలో పాల్గొన డం బాగుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్, సీపీ సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్‌లు జీవీ శ్యాంప్రసాద్‌లా ల్, గరిమ అగర్వాల్, శిక్షణ సంయుక్త కలెక్టర్ నవీన్ నికోలస్, కరీంనగర్ ఆర్డీవో ఆనంద్‌కుమార్, ఏవో జగత్‌సింగ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కాంగ్రెస్ మోహనాచారి, సీపీఐ (ఎం) మేలుకూరి వాసుదేవరెడ్డి, బీఎస్పీ గాలి అనిల్‌కుమార్, బీఆర్‌ఎస్ సత్తినేని శ్రీనివాస్, టీడీపీ ఈ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News