Sunday, January 19, 2025

2023 సంవత్సరం నుంచి యుపిఎస్‌సి ద్వారా ఐఆర్‌ఎంఎస్ పరీక్ష నిర్వహణ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రత్యేకంగా రూపొందించిన విధానం ద్వారా ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ (ఐఆర్‌ఎంఎస్)కి నియామక పరీక్ష నిర్వహించనున్నట్టు రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 2023 సంవత్సరం నుంచి యూపిఎస్‌సి ద్వారా ఐఆర్‌ఎంఎస్ పరీక్షను నిర్వహించనున్నట్టు పేర్కొంది. 150 మంది ఐఆర్‌ఎంఎస్ ఈ అభ్యర్థుల కోసం యూపిఎస్‌సి వద్దకు ప్రతిపాదనలు పంపినట్టు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. రైల్వే మంత్రిత్వ శాఖ యూపిఎస్‌సి, డిఓపిటితో సంప్రదింపులు జరిపి, ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ (ఐఆర్‌ఎంఎస్) నియామకాలు చేపట్టేందుకు నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. ఐఆర్‌ఎంఎస్ పరీక్ష రెండు దఫాలుగా ఉంటుందని అందులో మొదటగా ప్రిలీమినరీ స్క్రీనింగ్ పరీక్ష అనంతరం మెయిన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూలు ఉంటాయని అధికారులు తెలిపారు.

రెండో విడతలో స్క్రీనింగ్ పరీక్షలో తగిన అభ్యర్థులను బట్టి ఐఆర్‌ఎంఎస్‌లో అర్హత సాధించిన వారు సివిల్ సర్వీసెస్ (ప్రీలిమినరీ) పరీక్షలకు అలాగే తగిన సంఖ్యలో అభ్యర్థులను ఐఆర్‌ఎంఎస్ ప్రధాన పరీక్షకు స్క్రీనింగ్ చేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఐఆర్‌ఎంఎస్ (ప్రధాన) పరీక్షలో4 పేపర్లు ఉంటాయని, ఇవి సాధారణ వ్యాసరూప రూప ప్రశ్నలు దిగువన పేర్కొన్న ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడుతాయని రైల్వే శాఖ తెలిపింది. 2023 సంవత్సరానికి యూపిఎస్ వార్షిక పరీక్షా ప్రకారం, సివిల్ సర్వీసెస్ (పి) పరీక్ష – 2023 నోటిఫై చేయబడి, వరుసగా 01.02.2023, 28.05.2023 తేదీల్లో నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ఐఆర్‌ఎంఎస్ (మెయిన్) పరీక్ష కోసం అభ్యర్థులను పరీక్షించడానికి కూడా సిఎస్‌పి పరీక్ష – 2023 నిర్వహిస్తామని ఈ నేపథ్యంలో అదే షెడ్యూల్‌ను అనుసరించి ఐఆర్‌ఎంఎస్ పరీక్ష -2023 ద్వారా తెలియజేస్తామని రైల్వే శాఖ ప్రకటించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News