Wednesday, January 22, 2025

ఎన్నికల నిర్వహణ భారంగా కాకుండా బాధ్యతగా భావించాలి

- Advertisement -
- Advertisement -
  • జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్: ఎన్నికలను భారంగా భావించకుండా బాధ్యతగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన పనులు తదితర అంశాలపై జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ లతో కలిసి సెక్టోరల్ అధికారులు, తహసీల్దారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ రాబోయే ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. తహసీల్దార్లు, ఎస్‌హెచ్‌ఓలు, సెక్టోరల్ అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలని కలెక్టర్ సూచించారు. సబ్ డివిజన్ స్థాయిలో ఎన్నికల సెల్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని, పోలీస్ శాఖ నుండి డిఎస్పి స్థాయి అధికారులను సబ్ డివిజన్లో నియమించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

ఎన్నికల నియమాల్ని పాటిస్తూ అనుమానస్పద, సమస్యాత్మక ప్రాంతాలను, పోలింగ్ కేంద్రాలను, ఎప్పటికప్పుడు కిందిస్థాయిలో గమనిస్తూ నివేదికల రూపొందించుకోవాలని కలెక్టర్ తెలిపారు. మహిళలు, యువత స్వేచ్ఛాయుత వా తావరణంలో వారి ఓటును వేసుకునే సౌలభ్యంతోపాటు కులం, మతం, ప్రాంతం, ధనం, పరపతి వంటి ప్రభావాలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

గత ఎన్నికల్లో ఏవైనా తగాదాలు, ప్రాణ నష్టం జరిగిన ప్రాంతాలను కూడా గుర్తించాలని కలెక్టర్ తెలిపారు. ఈనెల 18న జరిగే సమావేశానికి అన్ని నివేదికలతో హాజరుకావాలని కలెక్టర్ సూచించారు. ప్రతి నియోజకవర్గంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయం నందు వేసే విధానంపై శిక్షణ అవగాహన కల్పించాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు.

ఈ సందర్భ ంగా సెక్టోరల్ అధికారులు, ఎస్ హెచ్వోలు, తహసీల్దార్లు ఎన్నికల్లో నిర్వహించాల్సిన విధివిధానాలు, వనరేబుల్ మ్యాపింగ్ విధానంపై జిల్లా స్థాయి ఎన్నికల మాస్టర్ ట్రైనర్/ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజెస్ పవర్ ప్రజెంటేషన్ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ సముదాయంలో ఈవీఎం ప్రదర్శన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.లి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News