అమీర్‌పేట నుంచి మియాపూర్ వరకు చిన్నారులతో ముచ్చట్లు
స్టేషన్‌లో విద్యార్ధులకు దేశభక్తి, నృత్యప్రదర్శనలు, డ్రాయింగ్ ఎగ్జిబిషన్
మెట్రో రైల్ బిన్నత్వంలో ఏకత్వానికి నిజమైన స్వరూపం: ఎన్వీఎస్‌రెడ్డి
హైదరాబాద్: జాతీయ, రాష్ట్ర ఆస్తిగా హైదరాబాద్ మెట్రో రైల్ బిన్నత్వంలో ఏకత్వానికి నిజమైన స్వరూపంగా నిలువడమే కాదు అత్యున్నత భద్రత, సమయపాలన, విశ్వసనీయతతో నగరం ముందుకు సాగడానికి సహాయపడుతుందని హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీవీఎస్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆజాదీకా అమృత్ మహోత్సవ్, స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా ఓజాయ్ రైడ్‌ను స్వయం కృషి అనాథ శరణాలయం, ట్వింకిల్ స్టార్ స్కూల్ విద్యార్ధులకు జాయ్‌రైడ్‌ను అమీర్‌పేట నుంచి మియాపూర్‌కు నిర్వహించారు. చిన్నారులతో కలిసి ప్రయాణించిన ఎన్‌వీఎస్‌రెడ్డి, కెవీబీరెడ్డిలు వారితో ముచ్చటించారు. అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో దేశభక్తి నేపథ్యంలో నృత్యప్రదర్శనలు, డ్రాయింగ్ ఎగ్జిబిషన్ నిర్వహించారు.
బారత స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన వీరులకు నివాళిగా ఉదయం 11.30 గంటలకు 52 సెక్షన్ల పాటు అన్ని మెట్రో స్టేషన్‌ల్లోను రైళ్లను ఆపి, జాతీయగీతం వినిపించారు. అనంతరం ఎల్ అండ్ టీఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ అండ్ సీఈవో కెవీబీ రెడ్డి ప్రసంగిస్తూ చిన్నారులతో కలిసి ఈవేడుకలు నిర్వహించడం మాకు ఓ మరుపురాని మధురానుభూతిని మిగిల్చింది. నగరపు జీవనరేఖగా, భారతదేశపు స్వాతంత్య్రతో పాటుగా ప్రతిధ్వనించే స్వేచ్చా ప్రయాణంలో ప్రతి ఒకరిని నిమగ్నం చేసే వివిధ సంఘటనలు, కార్యకలపాలతో హైదరాబాద్ మెట్రో రైల్ సందడి చేస్తోందన్నారు. మన ముత్యాల నగరికి జీవనాధారం, మొబిలిటీని అందించడంలో కీలకమైన సహకారి అయినందుకు గర్వస్తున్నామని పేర్కొన్నారు.