Sunday, December 22, 2024

యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కండక్టర్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఆర్టీసీ బస్ కండక్టర్‌ను రాయదుర్గం పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఫరూఖ్ నగర్ డిపోకు చెందిన బస్సులో పుప్పాలగూడ నుంచి హియాయత్ నగర్ కు ప్రయాణి స్తున్న యువతితో బస్సు కండక్టర్ మణికొండ వద్ద అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం ఆ యువతి ప్రయాణ సమయంలో ఒక కండక్టర్ తనతో ప్రవర్తించిన తీరు సరిగా లేదని ఎక్స్ ( ట్విట్టర్ )లో పోస్ట్ చేసింది.

దీనిపై స్పందించిన ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశిం చారు. విచారణ అనంతరం కండక్టర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి రాయదుర్గం సిఐ వెంకన్న మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన కండక్టర్‌పై బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని, కండక్టర్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News