Wednesday, January 22, 2025

నిస్సిగ్గుగా నిజం ఒప్పుకున్నారు

- Advertisement -
- Advertisement -

కేంద్ర మంత్రి ప్రకటనపై సిఎం కెసిఆర్

సచ్చినా బాయికాడ మోటర్లకు మీటర్లు పెట్టను
సూర్యాపేట సభలో మరోసారి స్పష్టం చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు

మనతెలంగాణ/హైదరాబాద్: బిజెపికి ఓటేస్తే మోరీలో పారేసినట్టేనని బిఆర్‌ఎస్ అధినేత, ము ఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెట్టనందుకే నిధులు ఇవ్వలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిగ్గులేకుండా చెప్పారని మండిపడ్డారు. స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రే ఈ విషయాన్ని ఒప్పుకున్నారని చెప్పారు. తెలంగాణలో రైతాంగానికి తాము ఉచిత కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. ప్రతి బాయి కాడ మీటర్ పెట్టాలని మోడీ అంటే సచ్చినా పెట్టనని చెప్పానని పేర్కొన్నారు.

దీంతో తెలంగాణకు రావలసిన రూ.25 వేల కోట్ల నిధులు కేంద్రం ఇవ్వలేదని చెప్పారు. ప్రభుత్వం దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు పెడితే తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని, తాను ఎన్ని లేఖలు రాసినా స్పందించలేదని ఆగ్రహం వ్యకం చేశారు. ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలని చట్టం ఉన్నా కేంద్రం ఇవ్వ లేదని మండి పడ్డారు. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బిజెపి పార్టీకి ఒక్క ఓటు కూడా ఎందుకు వెయ్యాలి? అని ప్రశ్నించారు. బిజెపికి ఓట్లు వేసే బదులు, బిఆర్‌ఎస్ అభ్యర్థి జగదీశ్‌రెడ్డికి వేస్తే ఆయన మెజారిటీ అయినా పెరుగు తుందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News