Saturday, December 28, 2024

విద్యార్థుల మధ్య ఘర్షణ .. డిగ్రీ విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

మద్యం, గంజాయి మత్తులో ఇంటర్, డిగ్రీ విద్యార్థి మధ్య జరిగిన కొట్లాటలో ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి…మండల పరిధి లక్ష్మిదేవిపల్లిలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న యానంబైల్ గ్రామానికి చెందిన అల్లూరి విష్ణు ( 20 ) ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులకు మధ్యన పాత కక్షలు ఉండేవని, ఈ నేపధ్యంలో శనివారం డిగ్రీ కళాశాల సమీపంలో ఇరువురు ఎదురెదురు పడ్డారు.

మద్యం మత్తులో ఉన్న ఇంటర్ విద్యార్థులు విష్ణుపై దాడి చేశారు. దాడిలో తీవ్రంగా దెబ్బలు తగలడంతో విష్ణు కింద పడి పోయాడు. అనంతరం దాడికి పాల్పడ్డవారు పారిపోయారు. తోటి విద్యార్థులు క్షతగాత్రుడిని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయంపై ఎస్‌ఐ. శ్రీనివాస్‌ను వివరణ కోరగా సమగ్ర విచారణ చేస్తున్నామని తెలిపారు. కాగా అక్కడ జరిగిన కొట్లాటను చూసిన వారు మద్యం, గంజాయి మత్తులో ఘర్షణ జరిగినట్లు అంటుండటం గమనార్హం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News