Monday, December 23, 2024

ఇరుగ్రామాల మధ్య ఘర్షణ

- Advertisement -
- Advertisement -

డిచ్‌పల్లి : డిచ్‌పల్లి మండలం అమృతాపూర్ గ్రామస్తులు, ఒడ్డెర కాలనీవాసులు ఆదివారం ఎర్రకుంటలో మొరం తవ్వకాల విషయంలో ఘర్షణకు దిగారు. ఇరు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఎర్రకుంటకు తరలిరావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అమృతాపూర్‌వాసులు ఊరి అవసరాల నిమిత్తం మొరం తవ్వకాలు చేపట్టగా ఒడ్డెర కాలనీవాసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనగా ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వారిని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. మొరం, మట్టి తవ్వకాల్లో తమకు వాటా ఇస్తామని అమృతాపూర్ గ్రామస్తులు మాట ఇచ్చి ప్రస్తుతం నిరాకరిస్తున్నారని ఒడ్డెర కాలనీవాసులు వాపోతున్నారు. దాదాపు రెండు గంటలపాటు ఇరు గ్రామాల జనం వాదనలకు దిగారు.

అమృతాపూర్ గ్రామస్తులు ఎంపిటిసి సాయిలుకు వ్యతిరేకంగా, ఒడ్డెర కాలనీవాసులు సర్పంచ్ భర్త నర్సింగ్‌రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎట్టకేలకు పోలీసులు ఇరువర్గాలకు నచ్చచెప్పడంతో జనం శాంతించారు. ఈవిషయమై అమృతాపూర్ వాసులు, ఒడ్డెరకాలనీ వాసులు నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను కలిసేందుకు వేర్వేరుగా ట్రాక్టర్లలో తరలివెళ్లారు. చిన్న సమస్యలపై ఘర్షణలకు దిగకుండా సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలని కలసిమెలసి ఉండాలని ఇరువర్గాలకు ఎమ్మెల్యే సూచించినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News