Thursday, January 23, 2025

గాంధీభవన్‌లో గందరగోళం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నాంపల్లి: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు న గరా మోగడంతో కాంగ్రెస్ నేతలు తమకు టికెట్లు ఇ వ్వాల్సిందేనంటూ తన అనుచరులతో కలిసి నాంపల్లిలోని గాంధీభవన్‌లో బలప్రదర్శనకు దిగుతున్నారు. పార్టీ అ భ్యర్థిత్వాల తమ నాయకుడికే కేటాయించాలంటూ అనుచరులతో కలిసి కాంగ్రెస్ రాష్ట్ర ఆఫీస్‌లో మంగళవారం నిరసన గళంమెత్తారు. కొన్నిరోజులు గా కాంగ్రెస్ టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరుకున్నది. తమ కులానికే పార్టీ టికెట్ దక్కాలంటూ వివిధ ని యోజకవర్గాల నుంచి వచ్చిన నేతలు తమ స్వరాన్ని పెంచుతూ ఏకంగా నిరసనకు దిగారు. అవతల వ్యక్తికి  టికెట్ ఎలా ఇస్తారో చూస్తామంటూ బెదిరింపులకు దిగడం, వారికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తెస్తున్నారు.

నగరంలో గోషామహల్ నియోజకవర్గం నుంచి బయటి వ్యక్తులకు ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వకూడదం టూ ప్లకార్డులతో ధర్నా చేశారు.లోకల్ వ్యక్తికే టికెట్ ఇవ్వాలి,బయటి వ్యక్తికి టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ నినాదాలు మిన్నంటాయి.గోషామహల్ బచావ్, కాం గ్రెస్ బచావ్, మాకు న్యాయం కావాలం టూ ప్లకార్డులు ప్రదర్శించారు. నిర్మల్‌కుమార్‌యాదవ్ సారధ్యంలో ధర్నా చేశారు. మహిళా కాంగ్రెస్ నాయకురాలు సునీతారావుకు ఎలా టికెట్ ఇస్తారంటూ ప్రశ్నించారు. ఆమె పేరును తెరమీదకి తీసుకొచ్చిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం, ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. రేవంత్ రెడ్డి కోట్ల రూపాయలు దండుకుని పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారంటూ పలువురు ఆరోపించారు. లోకల్ నాయకుడికే పార్టీ అభ్యర్థిత్వాన్ని కేటాయించాలంటూ నినాదాలు చేశారు. గోషామహల్ జనరల్ టికెట్ ఈ దఫా ఎస్సీలకే ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. పార్టీ సీనియర్ నాయకులు సంజయ్‌కుమార్ యాదవ్, మధుసుదన్ గుప్తా, కన్నయ్యలాల్, జాహంగీర్, శ్రీధర్ గౌడ్ తదితరులు నిరసనలో పాల్గొన్నారు. గాంధీభవన్ లోపలికి వెళ్లి పార్టీ నేతలపై బయటి వ్యక్తులకు టికెట్ ఇస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు. ఆగ్రహంతో ఊగిపోతున్న వారిని పార్టీ పెద్దలు సమూదాయించి శాంతిపజేశారు.

ఖైరతాబాద్ సీటు ఈ సారి కార్పొరేటర్ విజయారెడ్డికే ఇవ్వాల్సిందేనంటూ పలువురు శ్రేణులు నినాదాలుచేశారు. నాగర్‌కర్నూలు స్థానం నుంచి టిడిపి నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చే యత్నాలు జరుగుతున్నాయంటూ పార్టీ నేతలు నిరసన గళం విప్పారు. తొలి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులకే టికెట్ ఇచ్చి న్యాయం చేయాలంటూ నినాదాలు మిన్నంటాయి. వివిధ జిల్లాల నుంచి తమ నేతలకే టికెట్ ఇవ్వాల్సిందేనంటూ పట్టుపడుతున్నారు. గోషామహల్ సీటును పీసీసీ మత్యకారుల విభాగం ఛైర్మన్ మెట్టు సాయికుమార్‌కు ఇవ్వాలంటూ గంగపుత్ర చైతన్య సమితి నాయకులు రేవంత్‌రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. కరీంనగర్, ముషీరాబాద్, మంచిర్యాల, అంబర్‌పేట్, కామారెడ్డి నియోజకవర్గాల్లో ఈ వర్గం నేతలకు టికెట్ ఇచ్చి చట్టసభల్లో ప్రవేశానికి అవకాశం కల్పించాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News