Monday, December 23, 2024

జంటహత్యల కలకలం

- Advertisement -
- Advertisement -

గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది గ్రామ శివారులోని గర్కంపేట్ వెళ్లే రహదారి పక్కన ఓ వ్యవసాయ క్షేత్రంలో విగత జీవులుగా పడి ఉన్న రెండు మృతదేహాలు కనిపించాయి.వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన వారికి మృతదేహాలు గ్రామస్తులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. వారి వివరాల ప్రకారం హన్మన్లు అనే రైతుకు చెందిన వ్యవసాయ భూమిలో రెండు మృతదేహాలు పడి ఉండగా మృతదేహాలపై పదునైన ఆయుధలతో కొట్టి చంపినట్లు ఆనవాళ్లు ఉన్నాయి.

Also Read: భర్తతో వెళ్తున్న వివాహితపై సామూహిక అత్యాచారం

ఈ సంఘటన పై విచారణ చేపట్టిన పోలీసు అధికారులు సీతాగొంది గ్రామంలో మృతులిద్దరూ శుక్రవారం స్కూటీపై తిరిగినట్లు సీసీ పుటేజీలో ఆధారాలు లభ్యమయ్యాయి. దాని ఆధారంగా వారు ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్యనగర్ కాలనీకి చెందిన వివాహిత సోన్ కాంబ్లె ఆశ్విని (28) భుక్తాపూర్ కాలనీకి చెందిన రహమాన్‌గా గుర్తించారు. మృతురాలు వివాహిత కాగా యువకుడు అవివాహితుడు. వీరు ఇరువురి మధ్య వివాహేతర సంబంధమే కారణంగా హత్యలకు పోలీసులు అనుమానిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి జంట హత్యలకు కారుకులైన వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. మృతదేహాలకు శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించినట్లు ఎస్‌ఐ ఎల్. ప్రవీణ్‌కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News