Thursday, January 23, 2025

వినాయక చవితి పండుగ తేదీపై అయోమయం

- Advertisement -
- Advertisement -

వచ్చే నెల 18న జరుపుకోవాలి.. తెలంగాణ విద్వత్సభ
19వ తేదీనే అంటున్న భాగ్యనగర ఉత్సవ సమితి
త్వరలో తేల్చనున్న ప్రభుత్వం

మనతెలంగాణ/హైదరాబాద్: వినాయక చవితి పండుగను ఎప్పుడు జరుపుకోవాలని ఏర్పడిన సందిగ్ధతపై తెలంగాణ విద్వత్సభ క్లారిటీ ఇచ్చింది. గణేశ్ చతుర్థిని సెప్టెంబర్ 18న జరుపుకోవాలా? 19వ తేదీ న జరుపుకోవాలా అన్న దానిపై కొన్ని రోజులుగా ప్రజల్లో సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో స్పందించిన తెలంగాణ విద్వత్సభ భాద్రపద శుక్ల చతుర్థి అయిన సోమవారం ( సెప్టెంబర్ 18వ తేదీన) వినాయక చవితి పండుగను నిర్వహించుకోవాలని స్పష్టం చే సింది. 18వ తేదీన ఉదయం 9.58గంటల కు చవితి ఆరంభమై 19న ఉదయం 10.28 గం.లకు ముగుస్తుందని, అందుకే వినాయక చవితి పండుగను సోమవారం రోజే జరుపుకోవాలని విద్వత్సభ అధ్యక్షుడు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి, కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతి సోమవారం ఓ పకటనలో తెలిపారు. వినాయక చవితి నవరాత్రులను అదేరోజు ప్రారంభించాలని ప్రజలకు సూచించారు. ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లు వారు చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అన్ని పీఠాలకు శాస్త్రబద్ధంగా నిర్ణయించిన పండుగల జాబితాను విద్వత్సభ సమర్పిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గణేశ్ పండుగకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయడానికి విద్వత్సభ వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రంలో 100 మంది సిద్ధాంతుల సమక్షంలో జు లై 22,23న షష్టమ వార్షిక విద్వత్సమ్మేళనంలో చర్చించి ఈ పండుగ తేదీపై నిర్ణయం తీసుకున్నా రు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వారు తెలియచేశారు. అయితే సోమవారం గణేశ్ ఉత్సవాలకు సంబంధించి మంత్రులు నిర్వహించిన స మావేశంలో వచ్చే నెల 19 ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని పేర్కొనడం విశేషం. దీని పై ప్రభుత్వం నుంచి త్వరలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. భాగ్యనగర్ ఉత్సవ కమిటీ కూడా వచ్చేనెల 19వ తేదీ నుంచి గణేశ్ ఉత్సవాలు ప్రా రంభమవుతాయని ఓ ప్రకటనలో పేర్కొంది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News