Wednesday, November 6, 2024

హుజూరాబాద్ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్

- Advertisement -
- Advertisement -

Cong announces Huzurabad by-election candidate

హైదరాబాద్: హజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను అభ్యర్థిగా టిపిసిసి ప్రకటించింది. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి మాజీ మంత్రి కొండా సురేఖ అభ్యర్థిత్వం వైపు కాంగ్రెస్ నాయకత్వం మొగ్గు చూపింది. అయితే ఈ స్థానం నుండి పోటీకి ఆమె విముఖతను చూపింది. ఈ విషయాన్ని గురువారం నాడు సాయంత్రం కొండా సురేఖ పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పింది. అయితే కొత్త అభ్యర్థి కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అన్వేషణను మొదలు పెట్టింది. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పత్తి కృష్ణారెడ్డి, వ్యాపారవేత్త రవికుమార్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ పేరును కూడా కాంగ్రెస్ నాయకత్వం పరిశీలించింది.

అధినాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన వెంకట్

తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ అభ్యర్థిగా అవకాశం కల్పించిన ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్, టిపిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి వెంకట్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వెంకట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 2015 కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షునిగా ఎనినకై, మరోసారి 2018లో రాష్ట్ర అధ్యక్షునిగా తిరిగి ఎన్నిక కావడంలో ముఖ్య భూమిక రాహుల్‌గాంధీ ప్రవేశపెట్టిన ఎన్‌ఎస్‌యూఐ ఎన్నికల ప్రక్రియ వల్లే మధ్యతరగతి కుటుంబానికి చెందిన తనలాంటి వారు నేడు ఎంఎల్‌ఎ అభ్యర్థి స్థాయికి ఎదిగారన్నారు. ఎటువంటి రాజకీయ కుటుంబం నేపథ్యం లేకున్నా కూడా తన కష్టపడే తత్వాన్ని గుర్తించి ఎంఎల్‌ఎ అభ్యర్థిగా అవకాశం కల్పించడం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, హుజూరాబాద్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తానని వెంకట్ భరోసా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News