Thursday, January 9, 2025

టిఆర్‌ఎస్‌లో చేరుతున్న ఆయా పార్టీ నాయకులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నకిరేకల్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నఅభివృధ్ది సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఆయా పార్టీలకు చెందిన వారు టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం మున్సిపాలటీ పరిధిలోని పలు వార్డులకు చెందిన 30మంది ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో చేరుతున్నప్రతి కార్యకర్తకు న్యాయం జరిగేందుకు ముందుంటానని అన్నారు. అనంతరం సిఎం రిలీఫ్‌ఫండ్‌నుంచి మంజూరైన 24వేల రూపాయల చెక్కును కాటమయ్య బజారుకు చెందిన దుస్సే యాదయగిరికి ఎమ్మెల్యే చిరుమర్తి అందజేశారు. కార్యక్రమంలో నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, గర్షకోటి సైదులు, పెండెం సదానందం, చిలుకూరి లక్ష్మినర్సయ్య, నడికుడి వెంకటేశ్వర్లు, మాద నగేష్ , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News