- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలకు నేతలకు ఆ పార్టీ హైకమాండ్ నుంచి పిలుపొచ్చింది. మునుగోడు ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడతారనే ప్రచారం నేపథ్యంలో ఆ వ్యవహారంపై చర్చించేందుకు ముఖ్యనేతలను దిల్లీకి ఆహ్వానించినట్లు సమాచారం. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపిలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డిని సైతం దిల్లీ రావాలని సమాచారం ఇచ్చినప్పటికీ వెళ్లేందుకు ఆయన ఆసక్తి చూపనట్లు సమాచారం. ఈ పరిణామాలపై చర్చించేందుకు అవసరమైతే ఫోన్‌లో అందుబాటులో ఉంటానని జానారెడ్డి చెప్పినట్లు సమాచారం.
Cong High Command calls to Leaders on Rajagopal Reddy issue
- Advertisement -