Monday, November 18, 2024

గత 40ఏళ్లలో కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభం..

- Advertisement -
- Advertisement -

గత 40 ఏళ్లలో కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభం
నిపుణుల సూచనలు ప్రభుత్వం పాటించక పోవడమే ఈ దుస్థితి: కాంగ్రెస్ నేత చిదంబరం

న్యూఢిల్లీ: ప్రభుత్వం తన విపరీత విధానాలను విడిచిపెట్టి, ఎక్కువ కరెన్సీ నోట్లు ముద్రించి, అందుకు తగ్గట్టు వ్యయం పెంచాలని, మరో ఆర్థిక సంవత్సరం వ్యర్థం కాకుండా చూడాలని ఆర్థిక నిపుణులు చేసిన సలహాను పాటించాలని కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వానికి మంగళవారం హితవు పలికింది. దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ ఎంపి, మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి పి.చిదంబరం మంగళవారం ఘాటుగా విమర్శలు చేశారు. ఈమేరకు ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. గత నాలుగు దశాబ్దాల్లో అత్యంత చీకటి సంవత్సరంగా 2020-21 నిలుస్తుందని వ్యాఖ్యానించారు. 2020-21 నాటి పరిస్థితి 2021-22లో పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకోవాలని, తప్పులు ఒప్పుకోవాలని, పాలనా విధానాలను మార్చుకోవాలని ఆర్థిక నిపుణులు, విపక్షాల సలహాలను తీసుకోవాలని చిదంబరం సూచించారు.

కరోనా మహమ్మారి ప్రభావం దేశ ఆర్థిక పరిస్థితిపై తీవ్రంగా పడిందనడంలో ఎలాంటి సందేహం లేదని, అయితే బిజెపి సారథ్యం లోని ఎన్‌డిఎ ప్రభుత్వఅసమర్థ ఆర్థిక నిర్వహణతో ఈ కష్టాలు మరింత ఎక్కువయ్యాయని చిదంబరం పేర్కొన్నారు. ద్రవ్యలోటు గురించి ఎక్కువగా ఆందోళన చెందకుండా ప్రస్తుత తరుణంలో కొత్తగా రుణాలైనా తీసుకురావాలని, లేదా కరెన్సీని ముద్రించాలని సూచించారు. 2020-21 సంవత్సరానికి జిడిపి మైనస్ 7.3 శాతానికి పడిపోయిన నేపథ్యంలో ఆయన స్పందిస్తూ డబ్బును విరివిగా ఖర్చు చేయాల్సిన సందర్భం వచ్చిందన్నారు. ఆత్మనిర్భర్ వంటి ఉత్త పథకాలు వల్ల ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. గత ఏడాది కరోనా తగ్గుముఖం ఉన్నట్టు కనిపించినప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్, ఆమె ప్రధాన ఆర్థిక సలహాదారు ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని కథలు వినిపించారని, విస్పీడ్ రికవరీ అంటూ జోస్యం చెప్పారని కానీ అంతకు మించి చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. కోలుకునే సంకేతాలు లేవంటూ గతంలో తాము హెచ్చరించామని, ప్రభుత్వ వ్యయం పెంచాలని, పేద ప్రజలకు నగదు బదిలీ చేయాలని, ఉచిత రేషన్ అందరికీ అందించాలని చెప్పామని, తమ విజ్ఞప్తులన్నీ పెడచెవిన పెట్టారని, ఇప్పటి ప్రతికూల వృద్దికి ఇదే కారణమని చిదంబరం ఆరోపించారు.

Cong leader Chidambaram slams Centre over Financial Crisis

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News