భోపాల్: త్వరలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఆ పార్టీని తుప్పుపట్టిన ఇనుముగా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిసేత మళ్లీ రాష్ట్రాన్ని రోగిష్టిగా మారుస్తుంతని ఆయన ఆరోపించారు.
సోమవారం బిజెపి కార్యకర్తల కార్యకర్త మహాకుంభ్ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ప్రతిపక్ష ఇండియా బ్లాక్ లోని కాంగ్రెస్ ఇతర పార్టీలు నారీ శక్తికి భయపడే గత్యంతరం లేని పరిస్థితిలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపాయని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ పార్టీని కుటుంబ పార్టీగా ఆయన అభివర్ణించారు. కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ టు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని ఆయన చెప్పారు. ఆ పార్టీ తుప్పుపట్టిన నుము లాంటిదని, వర్షంలో నానితే కూలిపోవడం ఖాయమని ఆయన విమర్శించారు.
పేరు చెప్పకుండా రాహుల్ గాంధీని ప్రస్తావిస్తూ, సంపన్న కుటుంబంలో జన్మించిన కాంగ్రెస్ నాయకులకు పేదల బతుకులు వినోద యాత్రలని, పేద రైతుల పంట పొలాలు వీడియో షూటింగ్, ఫోటో సెషన్ లకు విహార కేంద్రాలని ప్రధాని మోడీ దుయ్యబట్టారు.