Monday, December 23, 2024

రూ. 500కే గ్యాస్ సిలిండర్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎన్నికల హామీ

- Advertisement -
- Advertisement -

భోపాల్: కర్నాటకలో ఐదు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌కు కూడా అదే ఫార్ములాను ప్రకటించింది.

మధ్యప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే అమలుచేయనున్న వాగ్దానాలను ఎఐసిసి ప్రధాన కార్యదర్శి , మధ్యప్రదేశ్‌లో పార్టీ ఇన్‌చార్జ్ రణదీప్ సింగ్ సూర్జీవాలా శనివారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. రూ. 500కే వంటగ్యాస్ సిలిండర్లు అందచేస్తామని ఆయన ప్రకటించారు.

మహిళలకు నెలకు రూ. 1,200 పెన్షనల్ అందచేస్తామని, 100 యూనిట్ల వరకు విద్యుత్ చార్జీలు మాఫీ చేస్తామని, 200 యూనిట్ల వరకు సగం చార్జీలే వసూలు చేస్తామని ఆయన ప్రకటించారు. వెనుకబడిన వర్గాలకు 27 శాతం రిజర్వేషన్లు అందచేస్తామని, రైతులకు రుణమాఫీ అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News