Friday, December 20, 2024

కనీస మద్దతు ధరపై కేంద్రం గ్యారంటీపై కాంగ్రెస్ అనుమానం!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరనిచ్చే లీగల్ గ్యారంటీపై బిజెపి ప్రభుత్వ ఉద్దేశ్యాలపై కాంగ్రెస్ గురువారం అనుమానాలు వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన కమిటీ ఏర్పాటు టర్మ్ నీరుగార్చేలా ఉన్నాయని, అది రైతుల డిమాండ్‌ను నెరవేర్చజాలదని పేర్కొంది.

రైతులు ప్రభుత్వ పాలసీల వల్ల మరింత అప్పులోకి కూరుకుపోతున్నారని కాంగ్రెస్ నాయకుడు, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా అన్నారు. బిజెపి 2022 నాటికల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పి వారిని ఎటు కాకుండా చేసిందన్నారు. కేంద్ర పాలసీలు రైతులకు అనుకూలంగా లేవు అని ఆయన పేర్కొన్నారు. కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి) కూడా దొరకనందున వారి ఆదాయం క్షీణించిందన్నారు.

నాన్ పర్ఫామింగ్ అస్సెట్స్(ఎన్‌పిఎ) కింద ప్రభుత్వం కార్పొరేట్లకు కోట్లాది రూపాయలను మాఫీ చేస్తోందని, అదే రైతులకు ఇచ్చిన అప్పులు మాత్రం వారిని అప్పుల ఊబిలోకి లాగుతున్నాయని పేర్కొన్నారు.

‘ఎంఎస్‌పి మీద ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిఫరెన్స్ కమిటీని నీరుగార్చారు. ఎంఎస్‌పి మీద లీగల్ గ్యారంటీ కూడా ఈ కమిటీ ఇవ్వలేదు’ అని ఆయన విలేకరులకు తెలిపారు. ‘ప్రభుత్వం కనీస మద్దతు ధరపై ఇస్తానన్న లీగల్ గ్యారంటీ ఉద్దేశ్యాలు కూడా అనుమానస్పదమే. ఎంఎస్‌పికి వారు చట్టబద్ధత ఇవ్వాలనుకుంటే దానిని ముందే ప్రకటించేవారు’ అని హుడా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News