Monday, November 18, 2024

కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్‌పై అమ్మకం పన్ను ఎత్తేయాలి

- Advertisement -
- Advertisement -

Cong-ruled states should cut tax on petrol, diesel:Dharmendra Pradhan

కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్య
బిజెపి పాలిత రాష్ట్రాలపై పెదవి విప్పని మంత్రి

న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలపై ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, మహారాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక సూచన చేశారు. పెట్రోలు ధరలు పెరుగుదల పేదలకు భారంగా మారుతున్నాయన్న ఆందోళన చేయడం కన్నా ఆయా రాష్ట్రాల్లో వాటిపై అమ్మకం పన్ను ఎత్తివేయాలని సూచించారు. అయితే అదే సమయంలో బిజెపి పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో పెట్రోల్ లీటరు వంద రూపాయలు దాటినా ఆయన ఆ రాష్ట్రాల అధిక పన్నులపై పెదవి విప్పకపోవడం గమనార్హం.

మహారాజా అగ్రసేన్ ఆస్పత్రిలో ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనాతో పోరాడుతున్న కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు ఖర్చులు, అభివృద్ధి పనులకు అదనపు ఆదాయం అవసరమని, దీన్ని పెట్రోల్, డీజిల్ నుంచి రాబట్టుకోడానికి చూస్తున్నట్టు చెప్పారు. పెరుగుతున్న పెట్రోలు, డీజిలు ధరలు వినియోగదారులకు ఇబ్బందులకు గురి చేస్తాయన్న సంగతి తనకు తెలుసని అన్నారు.

అయితే ఆహార ధాన్యాలను ఉచితంగా అందించడానికి ఈ ఒక్క ఏడాదే ప్రభుత్వం ఏకంగా లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని, ఇదికాక టీకాలు , ఆరోగ్య భద్రతకు సంబంధించి మౌలిక సదుపాయాల కోసం మరింత ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ విమర్శలకు స్పందిస్తూ మరి కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఈ ధరలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయని ప్రశ్నించారు. పేదలపై రాహుల్‌కు అంత ప్రేమ ఉంటే ఆ పన్నులను రద్దు చేయాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరాలని సూచించారు.అయితే బిజెపి పాలిత రాష్ట్రాలకు కూడా ఇలాగే చెబుతారా అన్న ప్రశ్నకు ఆయన నోరు మెదపలేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News