Wednesday, January 15, 2025

కాంగోలో వరదల బీభత్సం: 22 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బ్రెజవిల్లే: కాంగోలో భారీ వర్షాలు కురవడంతో నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. కాసాయ్ సెంట్రల్ ప్రావిన్స్ లో వరదల ధాటికి 22 మంది మరణించారు.  రోడ్లు, చర్చీలు, ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఈ వరదల్లో పదుల సంఖ్యలో గల్లంతైనట్టు స్థానిక మీడియా వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా కనంగా ప్రాంతంలో వరదలు బీభత్సం సృష్టించడంతో మృతుల సంఖ్య అక్కడే ఎక్కువగా ఉంది. 25 రోజుల క్రితం బుకావు ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో 14 మంది మరణించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News