Saturday, December 21, 2024

గోల్డెన్ గ్లోబ్ అవార్డు… ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌కు అభినందనలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ అవార్డు రావడంతో భారత దేశం గర్విస్తోందని, సంగీత దర్శకుడు కీరవాణి, సినిమా యూనిట్‌ను ప్రశంసిస్తూ చిరంజీవి, ఎఆర్ రహమాన్, క్రిష్, మోహన్ బాబు, నాగార్జున అక్కినేని, దేవి శ్రీప్రసాద్, అనుష్క శెట్టి, అల్లరి నరేష్, మంచు విష్ణు, నందిని రెడ్డి, రామ్ గోపాల్ వర్మ, రవి తేజ, తదితరలు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కీరవాణి సినిమా బృందాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు.

నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం సంతోషంగా ఉందని కీరవాణి తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌ను చూసి దేశం గర్విస్తోందని, దేశమే కాదు ప్రపంచం మొత్తం మనతో కలిసి డ్యాన్స్ చేస్తుందని కొనియాడారు. నటులు ఎన్‌టిఆర్, రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి, చంద్రబోస్, గాయకులు రాహుల్, కాలభైరవ, కోరియో గ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌కు ధన్యవాదాలు తెలిపారు. తన సినిమా ఫీల్డ్‌లో ఎన్నో పాటలకు డ్యాన్స్ చేశాను కానీ ‘నాటు నాటు’ పాట ఎప్పటికి హృదయానికి హత్తుకునే ఉంటుందని ఎన్‌టిఆర్ కొనియాడారు. భారతీయులతో పాటు సిని అభిమానుల తరఫున కీరవాణి, రాజమౌళి, సినిమా బృందానికి సంగీత విధ్వంసుడు ఎఆర్ రహమాన్ అభినందనలు తెలిపారు. కీరవాణికి అభినందనలు తెలపడంతో పాటు భవిష్యత్‌లో అస్కార్ అవార్డు గెలుస్తావని నటుడు మోహన్ బాబు ప్రశంసించారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా బృందానికి అభినందనలో పాటు అస్కార్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అక్కినేని నాగార్జున తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News