Saturday, December 28, 2024

మంత్రి మహేందర్‌రెడ్డికి అభినందనల వెల్లువ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డిని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ మర్యాద పూర్వకంగా కలిశారు. గురువారం ఆయనతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కలసి అభినందించారు. సచివాలయంలో మహేందర్ రెడ్డిని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, మునుగోడు శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిలు శాలువాతో సన్మానించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వీరితో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు మంత్రిని కలసి అభినందనలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News