Wednesday, January 22, 2025

మహిళలకు కాంగ్రెస్ 40 శాతం టికెట్లు

- Advertisement -
- Advertisement -

Congress 40 percent tickets for womens

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ మహిళలకు 40 శాతం టికెట్లు కేటాయించేలా కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే తొలి విడతలో 145 మంది అభ్యర్థులను ప్రకటించగా, అందులో 50 మంది మహిళలే. రెండో జాబితాలో 41 మంది పేర్లలో 16 మంది మహిళల పేర్లు ఉన్నాయి. కనీసం 140 నుంచి 150 మంది మహిళలకు పార్టీ టికెట్లు కేటాయించేలా ప్రియాంక ప్రణాళికలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలో ప్రముఖ సినీనటి అర్చనా గౌతమ్ (హస్తినాపూర్), ఉన్నావ్ బాధితురాలి తల్లి ఆశాసింగ్ (ఉన్నావ్), ఆశావర్కర్ పూనమ్ పాండే (షాజహాన్ పూర్ ), లఖీమ్ పూరి ఖేటీ ఘటనలో పోలీస్ బాధితురాలు రీతాసింగ్ (మొహమ్మదీ), మాజీ మేయర్ సుప్రియా అరోన్ (బరేలీ) జర్నలిస్టు నిదా అహ్మద్ (సంభాల్) వంటి ప్రముఖులను పోటీలో కాంగ్రెస్ నిలబెట్టింది. టికెట్లతో పాటే హామీల విషయం లోనూ కాంగ్రెస్ నేత ప్రియాంక తన మార్కును చూపింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 40 శాతం రిజర్వేషన్లు, 25 శాతం పోలీస్ పోస్టులు, 50 శాతం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పీడీఎస్ ) దుకాణాలు, పోన్లు, స్కూటర్లు వంటి హామీలను గుప్పించారు. గత పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవని గణాంకాలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ప్రియాంకకు నారీశక్తి ఎంతగా మేలు చేస్తుందనేది వేచి చూడాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News