Wednesday, January 22, 2025

కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది: కవిత

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: తెలంగాణలో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఎంఎల్‌సి కవిత మండిపడ్డారు. జగిత్యాల సబ్‌జైలులో హబ్సిపూర్ సర్పంచ రాజేశ్వర్ రెడ్డిని ఎంఎల్‌సి కవిత పరామర్శించారు. మెట్‌పల్లి బిఆర్‌ఎస్ కార్యాలయంలో ఎంఎల్‌సి కవిత మీడియా సమావేశంలో మాట్లాడారు.  బిఆర్‌ఎస్ నేతలపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోందని దుయ్యబట్టారు. బిఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెస్ ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో మహిళలు, విద్యార్థులు, రైతులకు రక్షణ కరువైందని విమర్శలు గుప్పించారు. జీవన్ రెడ్డి క్షకపూరిత చర్యలు పాల్పడితే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని కవిత హెచ్చరించారు. ప్రజల కోసం జీవన్ రెడ్డి పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కానీ ఇతర పార్టీల నాయకులపై అక్రమ కేసులు పెడితే ఊరుకోమని, చట్ట పరంగా ఎదుర్కొంటామని సవాల్ విసిరారు.

గత 30 ఏళ్లలో జరగని అభివృద్ధి బిఆర్‌ఎస్ పాలనలో జరిగిందని ప్రశంసించారు. తమ పాలనలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలను పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్నామని తెలిపారు.  యూనివర్సిటీలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఆడపిల్ల జట్టును మహిళ పోలీసులు లాగిన సంఘటనను కవిత ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఖాకీల రాజ్యం నడుస్తోందని దుయ్యబట్టారు. గతంలో కాంగ్రెస్, ఖాకీలపై పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇచ్చి హామీలు ప్రజలకు చేరే వరకు పోరాటం చేస్తామని కవిత హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News