Monday, December 23, 2024

ఈనెల 10న కాంగ్రెస్ అఫైర్స్ కమిటీ సమావేశం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఈనెల 10వ తేదీన జరగనుంది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు గాంధీ భవన్‌లో టిపిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానికి సభ్యులంతా హాజరుకానున్నారు. ఈనెల రెండో వారంలో తెలంగాణలో ప్రారంభం కానున్న కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర, తాజా రాజకీయ అంశాలపై చర్చించనున్నారు. బస్సు యాత్రను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఎక్కడ పెట్టాలి? సమన్వయం చేయడం ఎలా? కీలక నేతలు హాజరయ్యే ప్రాంతాలు? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సభలెక్కడ? అనే అంశాలపై చర్చించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

ఈనెల 15వ తేదీ, 16వ తేదీన ప్రియాంక గాంధీ, 18వ తేదీన, 19వ తేదీన రాహుల్ గాంధీని రాష్ట్రానికి రావాలంటూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఆహ్వానం పలికారు. ఏఐసిసి సమాచారం ప్రకారం రాష్ట్ర నేతలు ఆహ్వానించిన తేదీలకే ఆ ఇద్దరు అగ్ర నేతలు రానున్నట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News