Monday, January 20, 2025

జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తాం : కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

కేంద్రం ప్రతిపాదించిన “వన్ నేషన్ వన్ ఎలెక్షన్ ” రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు , ప్రజాస్వామ్యానికి, ఫెడరల్ విధానానికి వ్యతిరేకమని , దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ వెల్లడించారు. లోక్‌సభలో బిల్లును ్ల ప్రవేశ పెట్టినప్పుడు కనీసం 272 మంది ఎంపీలనైనా సమావేశ పర్చలేనప్పుడు బిల్లు ఆమోదానికి కావలసిన రెండింట మూడొంతుల మెజార్టీని కేంద్ర ప్రభుత్వం ఎలా సాధిస్తుందని జైరామ్ రమేశ్ ప్రశ్నించారు. ఈ బిల్లును పార్లమెంటరీ జాయింట్ కమిటీ పరిశీలనకు పంపిన తరువాత

జైరామ్ రమేశ్ ఈ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ విధాన నిర్ణయాన్ని ప్రస్తావించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో బీజేపీకి చెందిన పిపి చౌదరి, అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్‌కు చెందిన ప్రియాంక గాంధీ తదితరులు ఉన్నారు. ఈ ప్యానెల్‌లో లోక్‌సభకు చెందిన 27 మంది ఎంపీలు, రాజ్యసభకు చెందిన 12 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభ శుక్రవారం మూజువాణీ విధానం ద్వారా 12 మంది సభ్యులను జాయింట్ కమిటీకి నియమించింది. ఉభయ సభలు వాయిదా పడడానికి ముందు జాయింట్ కమిటీ ఆఫ్ పార్లమెంట్‌కు రెండు బిల్లులను పరిశీలించాల్సిందిగా సిఫార్సు చేస్తూ తీర్మానించడమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News