ఖమ్మం: రైతులకు ఇబ్బంది లేకుంగా రెవెన్యూ మార్కెటింగ్ అధికారులే చూడాలని, పత్తి రైతులను మోసం చేసే ప్రైవేటు వ్యాపారులపై చర్యలు తప్పవని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హెచ్చరించారు. గుర్రాలపాడులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా 40 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారని తెలియజేశారు. వాతావరణ పరిస్థితుల దృష్టా ఈ సారి పత్తి దిగుబడి తగ్గిందని, ఖమ్మం జిల్లాలో 17 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు. ఖమ్మం జిల్లాల్లో తొమ్మిది సిసిఐ కొనుగోలు కేంద్రాలు ద్వారా పత్తి కొనుగోలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతులు సంప్రదాయ పంటలు నుంచి ఉద్యాన పంటల వైపు మళ్లాలన్నారు. పత్తి, మిర్చి స్థానంలో పామాయిల్ సాగు చేస్తే అధిక లాభం వస్తుందని, రైతులకు గిట్టుబాటు ధర అందించాలనేదే తమ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.
రైతులు నాణ్యమైన పత్తి తెచ్చి గరిష్ట ధర పొందాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. ఎనుమాముల మార్కెట్‌లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఎనుమాముల మార్కెట్‌కు వచ్చిన ప్రతి పత్తి బస్తాను కొనుగోలు చేస్తామని సురేఖ స్పష్టం చేశారు. ఎనుమాముల మార్కెట్‌కు తెల్ల బంగారం పోటెత్తింది. వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో క్వింటాల్ పతి ధర రూ. 7521గా ఉంది.