Wednesday, January 22, 2025

10 రోజుల్లో మరో 17 మంది టిఆర్ఎస్ ఎంఎల్ఏలకు కాంగ్రెస్ ఎర?!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొత్తం 26 మంది బిఆర్ఎస్ ఎంఎల్ఏలను తమ పార్టీలోకి లాక్కోవాలన్న లక్ష్యంతో ఉంది. బడ్జెట్ సమావేశం కంటే ముందే ఆ పనిచేయాలనుకుంటోంది. ఇప్పటికే 10 మంది ఎంఎల్ఏలు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంపింగ్ జపాంగ్ లు దూకేశారు. మరో 17 మంది కూడా బిఆర్ఎస్ కు నీళ్లొదులుకోనున్నారని వినికిడి.

మూడింట రెండొంతుల మంది శాసనసభ్యులు పార్టీ ఫిరాయించిన పక్షంలో, శాసనసభ్యులు పార్టీ మారిన తర్వాత రాజీనామా చేయవలసి ఉంటుంది, దాంతో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది అని చట్టం ఆదేశిస్తోంది.

హైదరాబాద్‌కు చెందిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సీనియర్ నాయకుడు ఒకరు తెలిపిన వివరాల ప్రకారం, బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అంబర్‌పేట ఎంఎల్ఏ కాలేరు వెంకటేశ్ త్వరలో పార్టీ మారనున్నారు. కాంగ్రెస్‌లోకి వెళ్లిన చివరి బిఆర్‌ఎస్ ఎంఎల్ఏ శేరిలింగంపల్లి ఎంఎల్ఏ ఆరెకపూడి గాంధీ.

2023 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో జిహెచ్ఎంసి  ప్రాంతంలోని 24 సీట్లలో ఒక్కటి కూడా గెలవలేకపోయినందున, తెలంగాణలోని కాంగ్రెస్‌కు గ్రేటర్ హైదరాబాద్ లో బలోపేతం కావడానికి బిఆర్ఎస్ ఎంఎల్ఏలు చాలా అవసరం.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News