Monday, December 23, 2024

పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తుల కోసం కాంగ్రెస్ అలయన్స్ కమిటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ బీజేపీని ఎదుర్కొనేందుకు ఇతర పార్టీలతో పొత్తులపై చర్చలు జరిపేందుకు వీలుగా ఐదుగురు సభ్యులతో కాంగ్రెస్ మంగళవారం నేషనల్ అలియన్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కాంగ్రెస్ సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

ఈ నేషనల్ అలియన్స్ కమిటీకి రాజస్థాన్ మాజీ సిఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ మాజీ సిఎం భూపేష్ బఘేల్, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్, సీనియర్ నేత మోహన్ ప్రకాష్ సభ్యులుగా ఉంటారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఈ నేషనల్ అలియన్స్ కమిటీని ఏర్పాటు చేశారని తక్షణం ఇది అమలు లోకి వస్తుందని పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇతర పార్టీలతో పొత్తుల విషయమై అన్ని అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుందని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News